హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్ కే సురేందర్‌కు తెలంగాణ హైకోర్టు శుక్రవారం ఘనంగా వీడోలు పలికింది. తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్ నేతృత్వంలో శుక్రవారం న్యాయమూర్తులు, న్యాయవాదులు మొదటి కోర్టు హాలులో సమావేశమై వీడోలు పలికారు. కార్యక్రమంలో జస్టిస్ సుజయ్‌పాల్, అడ్వొకేట్ జనరల్ ఏ సుదర్శన్రెడి మాట్లాడుతూ జస్టిస్ కే సురేందర్ న్యాయవ్యవస్థకు చేసిన సేవలను కొనియాడారు.
జస్టిస్ సురేందర్ 22,622 ప్రధాన కేసులను, 18,812 మధ్యంతర పిటిషన్లను పరిషరించారని తెలిపారు. సత్యం కేసు, దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు, లుంబినీ పారు, గోకుల్‌చాట్ పేలుళ్ల కేసులో ఎన్ఐఏ తరఫున వాదనలు వినిపించారని, ఇందులో దోషులకు శిక్ష పడిందని గుర్తుచేశారు. జస్టిస్ సురేందర్ మాట్లాడుతూ తనకు సహకరించిన సహచర న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణను ఆయన నివాసంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ భేటీ అయ్యారు. ఇటీవల పద్మశ్రీ అవార్డు స్వీకరించిన మందకృష్ణను నారాయణ అభినందించా రు. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు రిజర్వేషన్లు, కులగణనపై చర్చించారు.