హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ షేక్‌పేట పరిధిలో సుందరీకరణ పేరిట హమీద్ కుంట, అంతగాని కుంట, బంజారా చెరువులను చెత్తతో పూడ్చివేసి, వాటి మధ్య నుంచి నడక మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సమర్పించిన నివేదికను హైకోర్టు తప్పుపట్టింది. తాము తనిఖీలకు వెళ్లినప్పుడు ఆ చెరువుల వద్ద ఎలాంటి పనులు జరగడం లేదని పీసీబీ పేర్కొనడం ‘గోడ మీద పిల్లి’ మాదిరిగా ఉన్నదని హైకోర్టు తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ రేణక యారా ధర్మాసనం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. చెరువుల పూడ్చివేతపై సమగ్ర నివేదిక అందజేయాలని పీసీబీని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఫిబ్రవరి 12కి వాయిదా వేసింది.