హైదరాబాద్, సెప్టెంబర్18 (నమస్తే తెలంగాణ): బీసీలు రాజ్యాధికారం దిశగా అడుగేయాలని హైకోర్టు అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ జగన్ పిలుపునిచ్చారు. ప్రముఖ బీసీ రచయిత చిం తం ప్రవీణ్‌కుమార్ రచించిన ‘సోయి’ బీ సీ ఉద్యమ సాహిత్యం పుస్తకాన్ని హైకోర్టు బార్ అసోసియేషన్ బాధ్యులు గురువారం ఆవిషరించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. మండల్ ఉద్యమ సమయంలో ఉన్నంత చైతన్యవంతంగా నేడు బీసీలు లేరని పేర్కొన్నారు.
ఇప్పుడే బీసీలకు సోయి వచ్చిందని, రాజ్యాధికార దిశగా దూకుడుగా ముందుకు సాగాల్సి ఉందని, అందుకు బీసీ సాహిత్యం దిక్సూచిలా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రాజేశ్వర్‌రెడ్డి, కార్యదర్శి విజరత్ అలీ, కోశాధికారి పాపయ్య, అంజలిదేవి, సీనియర్ న్యాయవాదులు అరుణ్‌కుమార్, కేవీ రామారావు, సుంకరీ జనార్దన్‌గౌడ్, తిరుపతివర్మ, జేపీ శ్రీకాంత్, గడ్డం సతీశ్సామ్రాట్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.