Tungabhadra Dam | అయిజ : కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వానలకు తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు వరద చేరీతున్నది. బుధవారం డ్యాంలోకి 63,320 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉండగా, అవుట్ ఫ్లో 212 క్యూసెక్కులు నమోదైంది.
డ్యాం గరిష్ట నీటి నిల్వ 105.788 సామర్థ్యానికి గానూ ప్రస్తుతం 39.718 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, 1633 అడుగుల పూర్తిస్థాయి నీటి మట్టానికి గానూ 1611. 07 నీటి మట్టం ఉన్నట్లు డ్యాం సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు. ఎగువ నుంచి వరద మరింత పెరిగే సూచనలు ఉన్నాయని, ఈ నెల చివరి నాటికి తుంగభద్ర డ్యాం నిండే అవకాశం ఉందని ఆయన తెలిపారు. టీబీ డ్యాంకు ఆశించిన మేరకు వరద చేరుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.