హైదరాబాద్: హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈసారి నైరుతి రుతుపవనాలు చాలా త్వరగా రాష్ట్రం మొత్తం విస్తరించాయి. రాబోయే 3 రోజులు అంటే 12, 13, 14 తేదీల్లో హైదరాబాద్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడనున్నాయి. హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, అత్యవసర బృందాలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ ఈవీడీఎం(EV&DM) డైరెక్టర్ హెచ్చరిక జారీ చేశారు.