జోగులాంబ గద్వాల : ఓ వ్యాపారి ఇంట్లో(Merchant house)దొంగలు పడి భారీగా బంగారం, వెండి దోచుకెళ్లిన(Heavy theft) సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్లే..గద్వాల పట్టణం (Gadwala town) వేదనగర్ కాలనీలోని రాజయ్య తోట ఏరియాలో రెడిమేడ్ వ్యాపారి మిటుకుల ప్రతాప్ నివాసముంటున్నాడు. కాగా, ప్రతాప్ వారి కుటుంబ సభ్యులు నిన్న గురువారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో కర్నూల్‌కు వెళ్లారు. అయితే ప్రతాప్ ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో అనుమానం వచ్చిన స్థానికులు ప్రతాప్‌కు ఫోన్ చేసి చెప్పారు.
వెంటనే ప్రతాప్ ఇంటికి వచ్చి చూడగా మూడు బీరువాలు తెరిచి అందులో ఉన్న సుమారు 30 తులాల బంగారం, 15 తులాల వెండి వస్తువులు 3,50,000 రూపాయల నగదు అపహరణకు గురైనట్లు తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీస్ సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు గద్వాల్ పట్టణ ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. విషయం తెలు సుకున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి దొంగతనం జరిగిన ఇంటిని పరిశీలించి బాధితులతో మాట్లాడారు. గద్వాలలో దొంగతనాలు జరగడానికి పోలీసుల వైఫల్యమే కారణమని ఆయన ధ్వజమెత్తారు.