నర్సంపేట/నెక్కొండ, అక్టోబర్19 : వరంగల్ జిల్లా నర్సంపేట, నెక్కొండలో ఆదివారం కురిసిన భారీ వర్షం రైతులను నిండా ముంచింది. నర్సంపేట నుంచి మల్లంపల్లి, భాంజీపేట, వరంగల్‌కు వెళ్లే ప్రధాన రహదారులకు ఇరువైపులా ఆరబోసిన మక్కలు వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి.
నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో ఆరబోసిన మక్కలు వరదలో కొట్టుకుపోతుండగా ఒకదగ్గరికి చేర్చడం కోసం రైతులు నానా ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో కన్నీంటిపర్యంతమయ్యారు. నెక్కొండ మార్కెట్లోనూ మక్కలు తడిసిముద్దయ్యాయి. తడిసిన మక్కలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.