ఝూ&మ్మని ఝూంకార నాదం.. నురగలు కక్కుతూ పరవళ్లు తొక్కుతున్న జలసిరి.. పచ్చని పైర్లను ముద్దాడుతూ నిండు చూలాలిలా కదులుతున్న గంగమ్మతల్లి.. ఆహా ఆ సింగారం చూడ రెండు కండ్లూ చాలటంలేదు.. పేరును సార్థకం చేసుకొంటూ కిలోమీటర్ల పొడవున ఝూంకార నాదం చేస్తున్నది మోయతుమ్మెద వాగు. సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండలంలో ఉన్న మోయతుమ్మెద (పెద్దవాగు) వాగు నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్నది. రెండువైపులా పచ్చని పంట పొలాలతో వాగు పరిసరాలు కనువిందు చేస్తున్నాయి. రాష్ట్రంలో మిషన్ కాకతీయ పథకానికి స్ఫూర్తినిచ్చింది ఈ పెద్దవాగే.
సిద్దిపేట, జూలై 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఝూ&మ్మని ఝూంకార నాదం.. నురగలు కక్కుతూ పరవళ్లు తొక్కుతున్న జలసిరి.. పచ్చని పైర్లను ముద్దాడుతూ నిండు చూలాలిలా కదులుతున్న గంగమ్మతల్లి.. ఆహా ఆ సింగారం చూడ రెండు కండ్లూ చాలటంలేదు.. పేరును సార్థకం చేసుకొంటూ కిలోమీటర్ల పొడవున ఝూంకార నాదం చేస్తున్నది మోయతుమ్మెద వాగు. సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండలంలో ఉన్న మోయతుమ్మెద (పెద్దవాగు) వాగు నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్నది. గిరాయిపల్లి గుట్టల నుంచి బస్వాపూర్ రిజర్వాయర్‌లోకి ఉత్తుంగ తరంగమైన పరవళ్లు తొక్కుతున్నది. వాగుకు రెండువైపులా పచ్చని పంట పొలాలు.. వాగునిండా ఉరకలేస్తున్న వరదతో మోయతుమ్మెద పరిసరాలు కనువిందు చేస్తున్నాయి.
Rain
15 కిలోమీటర్ల రిజర్వాయర్
ఒకప్పుడు నిత్యం ఒట్టిపోయి కనిపించిన మోయతుమ్మెద.. రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం, మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక కృషితో నేడు 10-15 కిలోమీటర్ల పొడవున భారీ రిజర్వాయర్‌ను తలపిస్తున్నది. మిషన్ కాకతీయ పథకానికి స్ఫూర్తినిచ్చింది ఈ పెద్దవాగే. నంగునూరు మండలం పరిధిలో ఇది దాదాపు 15 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తున్నది. సిద్దిపేట జిల్లాలోని కొండపాక గుట్టలు, దుద్దెడ మీదుగా ఆకునూరు, లింగాపూర్, ధూల్మిట్ట, తోర్నాల మీదుగా ఖాత వద్దకు చేరుతుంది. అక్కడి నుంచి జాలపల్లి, ఘణపూర్, అక్కెనపల్లి గ్రామాల మీదుగా ప్రవహించి బస్వాపూర్, సింగరాయులొద్దులగుండా శనిగరం చెరువులోకి వెళ్తుంది.
ఈ వాగును సజీవ జలధారగా మలిచేందుకు సీఎం కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే శ్రీకారం చుట్టారు. నంగునూరు మండలం ఘణపూర్ వద్ద చెక్‌డ్యాం నిర్మించారు. అనంతరం సిద్దిపేట ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రస్తుత ఆర్థిక మంత్రి హరీశ్‌రావు వాగుపై మరో ఎనిమిది చెక్‌డ్యాంలు నిర్మించారు. 15 కిలోమీటర్ల పరిధిలో 9 చెక్‌డ్యాంలు నిర్మించడంతోపాటు ఖాతా, ఘణపూర్, అక్కెనపల్లి గ్రామాల వద్ద చెక్‌డ్యాం మరియు బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టడంతో వాగు భారీ జలాశయంగా మారిపోయింది. ఒక చెక్‌డ్యాంలోని నీళ్లు మరో చెక్ డ్యాంకు అనుకునే విధంగా నిర్మించడంతో జలకళ ఉట్టి పడుతున్నది. వాగు పరీవాహక ప్రాంతం పచ్చటి పొలాలతో కనువిందు చేస్తున్నది. పెద్దవాగు ఒక్కసారి సాగితే చుట్టపక్కల గ్రామాల్లో రెండుపంటలు పుష్కలంగా పండుతాయని రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. గత వేసవిలో కాళేశ్వరం నీటిని సైతం ఈ చెక్‌డ్యాంలకు విడుదల చేశారు.