హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 19, 20న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 18న వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ఆ తరువాత 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.
రాష్ట్రంలో 17, 18న పొడివాతావరణం ఏర్పడి, పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురవవచ్చని తెలిపింది. గడిచిన 24 గంటల్లో 17 మండలాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురిసినట్టు పేర్కొన్నది.