హైదరాబాద్: నల్లగొండ, నాగర్కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పలు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. నాగర్కర్నూల్ జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి కురుస్తున్న వానలతో బిజినేపల్లి మండలంలోని వట్టెం వద్ద పెద్దవాగు ఉప్పొంగుతున్నది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. నల్లగొండ జిల్లాలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలతో మర్రివాగు, కొరటికల్లు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మునుగోడు వద్ద మర్రివాగు వరద ప్రవాహం రోడ్డుపై చేరింది. దీంతో చండూరు, మునుగోడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.