Rain Alert | హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో మరో రెండ్రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిర్మల్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కొత్తగూడెం జిల్లాల్లో అకడకకడ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
హైదరాబాద్లో ఉదయం ఆకాశం మేఘావృతమై, సాయంత్రం తర్వాత జల్లులు కురవవచ్చని అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని కుమ్రంభీం, మహబూబాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, ఖమ్మం, సూర్యాపేట, యాదాద్రి-భువనగిరి, మహబూబ్నగర్, మంచిర్యాల, సిద్దిపేట జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి.
కుమ్రంభీం జిల్లా తిర్యాలలో 5.65 సెం.మీ, మహబూబాబాద్ జిల్లా గార్లలో 5.47, జగిత్యాల జిల్లా పెగడపల్లిలో 4.95, సూర్యాపేట జిల్లా అనంతగిరిలో 4.26, పెద్దపల్లి జిల్లా ధర్మారంలో 4.58, ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో 4.02, యాదాద్రి-భువనగిరి జిల్లా ఆత్మకూర్-ఎంలో 3.85, మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో 3.67, మంచిర్యాల జిల్లా జైపూర్లో 3.62, సిద్దిపేట జిల్లా నంగనూర్లో 3.42 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.