TS Weather | హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రాగల నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వానలు పడుతాయని చెప్పింది.
బుధవారం నుంచి గురువారం వరకు ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొన్నది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో, శుక్రవారం నుంచి శనివారం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.