హైదరాబాద్ : సంగారెడ్డి(Sangareddy), మెదక్(Medak) జిల్లాలో గాలివాన(Heavy rain) భీబత్సం సృష్టించింది. ఆదివారం ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో కల్లాల్లోని ధాన్యం తడిసిపోయింది. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం రామోజీ పల్లిలో పిడుగుపాటుకు(Thunder) తండ్రి,కొడుకు శ్రీరాములు(45), శివరాజు(15)మృతి చెందాడు. ఈదురుగాలులకు టార్ఫాలిన్ కవర్లు ఎగిరిపోయాయి. నాగలిగిద్ద మండలం ముక్తాపూర్లో 5.1 సెం.మీ.,మొగుడంపల్లిలో 2.6 సెం.మీ., పాపన్నపేట మండలం లింగాయిపల్లిలో1.9 సె.మీ. వర్షపాతం నమోదయింది.