Rain Alert | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. అయితే దక్షిణ తెలంగాణకు భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనంతో మరో నాలుగు రోజులు వానలు దంచికొట్టనున్నాయని పేర్కొంది. నల్లగొండ, యాదాద్రి, నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్, నారాయణపేట, గద్వాల జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇక క్యుములో నింబస్ మేఘాల వల్ల ఇవాళ, రేపు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ సాయంత్రం, రాత్రి సమయాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం సాయంత్రం కూడా నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిన్నటి అంత వర్షం కురిసే అవకాశం లేదని స్పష్టం చేశారు. మధ్యాహ్నం వరకు ఎలాంటి వర్ష సూచన లేదన్నారు. సాయంత్రం వేళ పలుచోట్ల ఉరుములు, మెరుపులు సంభవించనున్నాయి.
హెల్ప్‌లైన్ ఫోన్ నంబర్లు ఇవే..
ఎన్డీఆర్ఎఫ్ – 8333068536
ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ – 8712596106
హైడ్రా – 9154170992
ట్రాఫిక్ – 8712660600
సైబరాబాద్ – 8500411111
రాచకొండ – 8712662999
టీజీఎస్పీడీసీఎల్ – 7901530966
టీజీఎస్ఆర్టీసీ – 9444097000
జీహెచ్ఎంసీ – 8125971221
హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ – 9949930003