
మోర్తాడ్/మెదక్, సెప్టెంబర్ 26: సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన బీఎస్పీ నాయకులు సంగం అనిల్‌కుమార్, ఎలాల ప్రకాశ్ ఆదివారం హైదరాబాద్‌లో గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరా రు. ఈ సందర్భంగా అనిల్, ప్రకాశ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ సర్కార్ ప్రజల సంక్షే మం, తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నదన్నారు. అందుకే టీఆర్ఎస్లో చేరినట్టు తెలిపారు. కాగా మెదక్ జిల్లా నిజాంపేట మండల బీజేపీ నాయకులు నాగరాజు, మల్లేశం, వెంకటేశ్, నవీన్, నారాగౌడ్, వజ్జా స్వామి తదితరులు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.