హైదరాబాద్: హైదరాబాద్లో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షంతో మూసీ (Musi) నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా వంగిండ మండలంలోని సంగెం సమీపంలో ఉన్న భీమలింగ వద్ద లోలెవల్ బ్రిడ్జిపై నుంచి మూసీ ప్రవాహం కొనసాగుతున్నది. వరద ప్రమాదకర స్థాయిలో ఉండటంతో వంతెన పైనుంచి ఎవరూ ప్రయాణించకుండా పోలీసులు బ్రిడ్జికి ఇరువైపులా బారికేట్లు ఏర్పాటు చేశారు. దీంతో సంగెం పరిసర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
మరోవైపు భారీ వర్షాలకు యాదాద్రి జిల్లా నేలపట్ల వద్ద ఈదుల వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నది. అయితే వరదను లెక్కచేయకుండా పలువరు కారులో వాగును దాటేందుకు ప్రయత్నించారు. దీంత కారు కొద్ది దూరం కొట్టుకుపోయి ఆగిపోయింది. అతికష్టంమీద అందులో నుంచి బటయకు దిగిన ఏడుగురు ప్రయాణికులు సురక్షితంగా ఒట్టుకు చేరుకున్నారు.