Nalgonda | నీలగిరి, ఫిబ్రవరి 2: మత్తు ట్యాబ్లెట్లు విక్రయిస్తున్న, వాడుతున్న ముగ్గు రిని నల్లగొండ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నల్లగొండలో శుక్రవా రం ఎస్పీ చందనాదీప్తి మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. నల్లగొండలో ప్రిస్క్రిప్షన్ లేకుండా స్పాస్మో ప్రాక్సివోన్ ప్లస్, అల్ట్రా కింగ్, ట్రామాడెక్స్ ఇంజక్షన్లతో కిక్కు పొం దుతున్న పట్టణానికి చెందిన ఎండీ మహమ్మద్ జబీఉల్లా, మహ్మద్ సల్మాన్‌ను పట్టణ పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. వీరు మూడేండ్లుగా శివాజీనగర్‌కు చెందిన తౌడోజు నరేశ్‌కు చెందిన న్యూ హెల్త్‌కేర్ ఫార్మసీలో ఎక్కువ మోతాదులో ట్యాబ్లెట్స్ తీసుకుని మత్తు అనుభూతిని పొందుతున్నారు.
టాస్క్‌ఫోర్స్ అధికారులు, వన్‌టౌన్ పోలీసులు శుక్రవారం సదరు మెడికల్ షాపులో తనిఖీలు చేయగా వారి వద్ద 4,032 స్పాస్మో ప్రాక్సివోన్ ప్లస్ మాత్రలు, 585 అల్ట్రాకింగ్ టాబ్లెట్స్, 300 ట్రామాడెక్స్ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మహమ్మద్ జబీఉల్లా, మహ్మద్ సల్మాన్, విక్రయిస్తున్న తౌడోజు నరేశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్పీ తెలిపారు. జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, వాటిని విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.