హాలియా, నవంబర్ 1 : కుమారులు అన్నం పెట్టడం లేదని ఓ తల్లి ఆత్మహత్యాయత్నం చేసిన హృదయ విదారక ఘటన నల్లగొండ జిల్లా హాలియాలో శుక్రవారం చోటుచేసుకున్నది. ఎస్సై సతీశ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవూర మండల కేంద్రానికి చెందిన ఊరె ముత్తమ్మకు ఇద్దరు కుమారులు. ముత్తమ్మకు ఇదివరకే రెండు కాళ్లు విరిగాయి.
ఇద్దరు కొడుకులు ఉండి కూడా తన యోగక్షేమాలు చూసుకోవడం లేదని తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె శుక్రవారం హాలియాకు వచ్చి ఆత్మహత్య చేసుకునేందుకు సాగర్ ఎడమ కాల్వలో దూకింది. వెంటనే స్థానికులు గుర్తించి కాల్వలోకి దూకి ముత్తమ్మను కాపాడారు. అనంతరం వృద్ధురాలిని చికిత్స నిమిత్తం 108లో ప్రభుత్వ దవాఖానకు తరలించారు.