రాధాకిషన్‌రావు బెయిల్ పిటిషన్‌పై విచారణ నేటికి వాయిదా
ఫోన్ల ట్యాపింగ్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలుచేశారు.
నాంపల్లి కోర్టులు, జూలై 15(నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలుచేశారు. దీనిపై సోమవా రం విచారణ చేపట్టిన 17వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్.. కౌం టర్ దాఖలు నిమిత్తం పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు నోటీసులు జారీ చేశారు. గడువు కావాలని పీపీ కోరడంతో విచారణ మంగళవారానికి వాయిదా పడింది.
పోలీసుల కస్టడీ పిటిషన్‌పై నేడు తీర్పు
కిడ్నాప్‌తోపాటు బెదిరింపు కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు ప్రొడక్షన్ వారెంట్‌పై రాధాకిషన్‌రావును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ నిమిత్తం రాధాకిషన్‌రావును 10 రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. దీంతో తీర్పును మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

