హైదరాబాద్ సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ): పొక్సో కేసులో బండి భగీరథ్‌ను తదుపరి విచారణ నిమిత్తం వారం రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పేట్‌బషీరాబాద్ పోలీసులు శుక్రవారం కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను స్వీకరించిన మల్కాజిగిరి న్యాయస్థానం.. విచారణను ఈనెల 26కు వాయిదా వేసింది. కాగా, భగీరథ్‌పై నమోదైన కేసును మల్కాజిగిరిలోని ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు బదిలీ చేశారు.