హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ‘ఆరోగ్య మహిళ’ సేవలు విస్తరిస్తున్నాయి. ఈ ఏడాది మార్చి 8వ తేదీన 100 ‘ఉమెన్ స్పెషల్ క్లినిక్’లు ప్రారంభం కాగా, ప్రస్తుతం వీటి సంఖ్య 275కు చేరింది. ప్రతి మంగళవారం ఈ కేంద్రాల్లో మహిళలకు ఆరోగ్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. మార్చి 8 నుంచి ఈ నెల 27 నాటికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,22,536 మంది మహిళలు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.
వీరికి ప్రాథమికంగా 8 రకాల వైద్యపరీక్షలు నిర్వహించారు. టీ డయాగ్నోస్టిక్స్ ద్వారా 43,444 పరీక్షలు చేశారు. లక్షణాల ఆధారంగా ఇతర వైద్య పరీక్షలు జరుపుతున్నారు. 6,710 మందికి మ్రూతకోశ ఇన్ఫెక్షన్లు గుర్తించి చికిత్స ప్రారంభించారు. క్యాన్సర్ ఇతర అనుమానిత లక్షణాలు ఉన్న 7,576 మందిని పై దవాఖానలకు రెఫర్ చేశారు.