హైదరాబాద్, మే14 (నమస్తే తెలంగాణ): ఆరోగ్య తెలంగాణే రాష్ట్ర పభుత్వ ప్రధాన లక్ష్యమని, ఆ దిశగా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వైద్యులు కృషి చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవన సముదాయంలో ఏర్పాటుచేసిన తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ (తానా) కార్యాలయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ ప్రతీ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ చొప్పున మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దకుతుందని కొనియాడారు. వైద్యం, ఆరోగ్యం, విద్య ప్రధాన అజెండాగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నదని చెప్పారు. అనంతరం వినోద్‌కుమార్‌ను తానా సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో తానా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వీ రాకేశ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎంవీ ప్రసాద్, వైస్ చైర్మన్ డాక్టర్ సీహెచ్ జగన్మోహన్రావు పాల్గొన్నారు.
దూదేకుల సమస్యలను పరిష్కరించండి
రాష్ట్రంలోని దూదేకుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హోం మంత్రి మహమూద్ అలీ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్‌కు ఆ సంఘ నాయకులు వినతిపత్రం అందించారు. ఆదివారం హైదరాబాద్‌లో నూర్‌బాషా, దూదేకుల వృత్తి సంక్షేమసంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సిద్దాసాహెబ్ ఆధ్వర్యంలో మంత్రి మహమూద్ అలీతో పాటు బోయినపల్లి వినోద్‌కుమార్‌ను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఉద్యమకాలం నుంచి పార్టీలో పనిచేస్తున్న వారికి రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయిలలో నామినేటెడ్ పదవులు కల్పించాలని, దూదేకుల కార్పొరేషన్ ఏర్పాటు, దూదేకుల ఆత్మగౌరవ భవన నిర్మాణం, రిజర్వేషన్ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర దూదేకులసంఘం వరింగ్ ప్రెసిడెంట్ ఎండీ సుసాన్అలీ తదితర రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.