హైదరాబాద్ : వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన హరీష్ రావును ఆ శాఖ ఉన్నతాధికారులు బుధవారం సాయంత్రం మర్యాద పూర్వకంగా కలిశారు. వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వి, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ వాకాటి కరుణ, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డా. శ్రీనివాస రావు, వైద్య విద్యా శాఖ డైరెక్టర్ డా. రమేష్ రెడ్డి, ఓ.ఎస్.డి. గంగాధర్, కాళోజి నారాయణ రావు హెల్త్ యునివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డా. కరుణాకర్ రెడ్డి, టీ.ఎస్.ఎం.ఐ.డి.సి. ఎండి చంద్ర శేఖర్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు మంత్రిని కలిశారు.
ఈ సందర్బంగా వైద్య ఆరోగ్య శాఖ పని తీరుపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖకు చెందిన పలువురు అధికారులు, ఉద్యోగులు మంత్రి హరీశ్‌రావుకు శుభాకాంక్షలు తెలిపారు.