హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): వరంగల్‌లో ఆత్మహత్యకు యత్నించి నిమ్స్‌లో చికిత్స పొందుతున్న పీజీ వైద్య విద్యార్థి ప్రీతిని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం రాత్రి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకొన్నారు. అత్యుత్తమ వైద్యం అందించాలని, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రీతి కుటుంబసభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. ఈ కేసు విచారణ పూర్తిగా నిష్పక్షపాతంగా జరుగుతున్నదని, ఆత్మహత్యాయత్నానికి కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి స్పష్టం చేశారు.