హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ దవాఖానాల్లో అవయవమార్పిడి చికిత్సలను ప్రోత్సహించడంలో భాగంగా ఉమ్మ డి జిల్లా కేంద్రాల్లో ఆర్గాన్ రిట్రైవల్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.
బుధవారం జూబ్లీహిల్స్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో జీవన్‌దాన్ పనితీరు, ప్రభుత్వ దవాఖానల్లో అవయవ మార్పిడి చికిత్సల ప్రోత్సాహంపై అధికారులతో సమావేశంలో నిర్వహించారు. హైదరాబాద్ నిమ్స్, గాంధీ, ఉస్మానియాతోపాటు వరంగల్ ఎంజీఎం, ఆదిలాబాద్ రిమ్స్‌లోనూ అవయవమార్పిడి సర్జరీలు జరిగేలా చర్యలు తీసుకోవాలని మం త్రి ఈ సందర్భంగా ఆదేశించారు.