ఆకుకూరలతో ఆరోగ్యమస్తు!
- నిత్యం బువ్వలో 20% ఉండాలి
- వండే విధానమే అత్యంత కీలకం
- తరిగిన తర్వాత కడిగితే లాభంలేదు
- పప్పుతో కలిపి వండితే ఎక్కువ మేలు
- వెల్లడించిన ఎన్ఐఎన్ శాస్త్రవేత్తలు
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ఆకుకూరలంటే చాలామందికి బోర్. ఆ గడ్డికూరలు ఎవరు తింటారంటూ మూతివిరిచేవారూ లేకపోలేదు. కానీ, ఆకుకూరలు ఆరోగ్యానికి దివ్యమైన ఔషధం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోగనిరోధకశక్తిని పెంపొందించడంలో, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించడంలో ఆకుకూరలది ప్రత్యేక స్థానం. ప్రతిరోజూ మనం తీసుకొనే ఆహారంలో దాదాపు 20 శాతమైనా ఆకుకూరలు ఉండాలని సూచిస్తున్నది నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్). కానీ ప్రజల్లో ఆకుకూరల వినియోగంపై సరైన అవగాహన లేకపోవడంతో ఎన్నో విలువైన ప్రయోజనాలను కోల్పోతున్నారని ఎన్ఐఎన్ నిపుణులు చెప్తున్నారు.
ఆకుకూరలతో అదిరేటి ఆరు ప్రయోజనాలు
- ఆకుకూరల్లో మిగిలిన కూరగాయలతో పొలిస్తే విటమిన్ కే ఎకువగా ఉంటుంది. విటమిన్ కే రక్తం గడ్డకట్టటానికి తోడ్పడుతుంది. గుండె రక్తనాళాల జబ్బులు, ఎముకలు గుల్లబారటం, రక్తనాళాల్లో, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడం వంటి వాటిని నియంత్రించకలిగే శక్తి దీనికి ఉంటుంది.
- కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం వీటిల్లో ఉంది. లివర్‌లో కొలెస్ట్రాల్‌ను వినియోగించుకొని బైల్యాసిడ్ను తయారుచేస్తుంది. ఈ కొవ్వు జీర్ణప్రక్రియలో తోడ్పడుతుంది. ఆకుకూరల్లో ఉండే పీచుతో బైల్యాసిడ్ కల్సినపుడు అది విసర్జించబడుతుంది. ఆందుచేత లివర్ మళ్లీ, మళ్లీ బైల్యాసిడ్ను తయారు చేసుకోవలసి వస్తుంది. ఈ విధంగా కొలెస్ట్రాల్ ఎకువగా వినియోగమవుతుంది.
- ఆకుకూరలు కంటిచూపును పరిరక్షిస్తాయి. ఆకుకూరల్లో విటమిన్ ఏ.. కెరొటినాయిడ్, క్సైంతిన్ రూపంలో ఉంటుంది. ఇవి అత్యంత కాంతివంతంగా వచ్చే వెలుతురును కూడా నియంత్రించగలిగే శక్తిని కలిగి ఉంటాయి.
శరీరానికి కావలసిన ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఆకుకూరల్లో బీ విటమిన్లు, ముఖ్యంగా బీ5 (పాంటోథెనిక్ యాసిడ్) ఉంటాయి. ఇవి పిండిపదార్థాలను గ్లూకోజ్ రూపంలోకి మారుస్తాయి. అందుచేత శరీరానికి శక్తినిచ్చే ఇంధనంగా పనిచేస్తుంది. బీ విటమిన్లకు నీటిలో కరిగే గుణం ఉంటుంది. కనుక, ఇవి శరీరంలో నిల్వఉండవు. అందుకే ఆకుకూరలను ప్రతిరోజూ తీసుకోవాలి. - ఎముకల ఆరోగ్యానికి ఆకుకూరలు ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో కాల్షియం అనే ఖనిజలవణం అధికంగా ఉంటుంది. ప్రతిరోజూ ముఖ్యంగా 31-35 ఏండ్ల వయస్సు మహిళలు 1,000 మిల్లీగ్రాముల కాల్షియం తీసుకోవాలి. ప్రతిరోజూ ఆకుకూరలు తీసుకొంటే కొంతవరకు సిఫార్సు చేసిన పరిమాణాన్ని పొందవచ్చు.
- పీచు పదార్థం ఎకువగా ఉండటం వలన పెద్దపేగు క్యాన్సర్‌ను నివారించగలుగుతాయి.
ఆకుకూరలు వండుకొనే విధానం
- ఆకుకూరలను ముందుగా కడిగిన తరువాతనే తరగాలి.
- కోసిన తరువాత నీళ్లలో వేస్తే .. వాటిలో ఉండే బీ విటమిన్లు వృథాగా కరిగిపోతాయి.
- తకువ నూనెతో వండాలి.
- ఎక్కువ నూనె వాడితే ఆకుకూరల్లో ఉండే కే విటమిన్ వృథాగా కరిగిపోతుంది.
- నీళ్లు కలపకుండా ఆకుకూరల నుంచి ఊరే నీళ్లతోనే ఉడికించాలి.
- ఆకుకూరలను పప్పుతో కలిపి వండటం వలన పోషక పదార్థాల సమతుల్యత లభిస్తుంది.
- రెండు మూడు రకాల ఆకుకూరలు కలిపి వండటం వలన శరీరానికి కావాల్సన అన్నిరకాల ఖనిజ లవణాలు, విటమిన్లను తేలికగా పొందవచ్చు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

