నాన్‌స్టాప్ నవ్వులు గ్యారెంటీ!
‘నేను సరైన కామెడీ సినిమా చేసి పదేళ్లవుతున్నది. ‘నాంది’ తర్వాత కొన్ని సీరియస్ సినిమాలు చేశాను. కానీ కామెడీని ఎప్పుడూ వదిలిపెట్టలేదు. పదేళ్లుగా మీరు మిస్ అయ్యారనుకున్న నరేష్‌ను ఇందులో చూస్తారు. రెండున్నర గంటల పాటు మిమ్మల్ని నవ్వించే చిత్రమిదని గ్యారెంటీ ఇస్తున్నా’ అన్నారు అల్లరి నరేష్.
‘నేను సరైన కామెడీ సినిమా చేసి పదేళ్లవుతున్నది. ‘నాంది’ తర్వాత కొన్ని సీరియస్ సినిమాలు చేశాను. కానీ కామెడీని ఎప్పుడూ వదిలిపెట్టలేదు. పదేళ్లుగా మీరు మిస్ అయ్యారనుకున్న నరేష్‌ను ఇందులో చూస్తారు. రెండున్నర గంటల పాటు మిమ్మల్ని నవ్వించే చిత్రమిదని గ్యారెంటీ ఇస్తున్నా’ అన్నారు అల్లరి నరేష్. ఆయన కథానాయకుడిగా నటించిన ఫాంటసీ కామెడీ ఎంటర్టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించారు. సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం టీజర్‌ను విడుదల చేశారు. ఇంద్రలోకం నుంచి రంభ, ఊర్వశి, మేనక భూలోకంలోకి అడుగుపెడితే ఏం జరిగిందనే సంఘటనల నేపథ్యంలో టీజర్ ఆద్యంతం నవ్వుల్ని పంచింది.
ఈ సందర్భంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ ‘నేను చిన్నప్పటి నుంచి నాగార్జునగారికి పెద్ద అభిమానిని. ‘నా సామిరంగా’లో ఆయనతో కలిసి నటించా. ఇప్పుడు ఆయన బ్యానర్లో సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నా’ అన్నారు. ఈ సినిమా థియేటర్లలో నవ్వులమోత మోగిస్తుందని, అన్నపూర్ణ స్టూడియోస్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ బ్యానర్‌తో కలిసి సినిమా చేయడం ఆనందంగా ఉందని నిర్మాత రాజేష్ దండా పేర్కొన్నారు. ఫాంటసీ, గ్రామీణ నేపథ్యాన్ని కలిపి ప్రేక్షకుల్ని నవ్వించాలనే లక్ష్యంతో సినిమా చేశామని దర్శకుడు చంద్రమోహన్ చింతాడ తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
EAPCET Office | గెస్ట్‌హౌస్‌గా ఎప్‌సెట్ ఆఫీస్.. అడ్మిషన్ల వేళ జేఎన్టీయూ సంచలన నిర్ణయం!
Congress | రైతును కూలీగా మార్చిన కాంగ్రెస్.. యాదాద్రి జిల్లా కొండ్రెడ్డిచెరువులో దుస్థితి
Heavy Rains | మురసు ఎఫెక్ట్‌తో రెండ్రోజులు భారీ వర్షసూచన.. ఈ నెల 15నాటికి మరో తుపాను!
Conductor Pravalika | బస్సులో ‘చిల్లర’ వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడ్డ కండక్టర్ ప్రవళిక మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

