ఆన్లైన్లోనే గ్రీన్‌కార్డ్, పౌరసత్వ దరఖాస్తులు!.. అమెరికా ప్రభుత్వ కొత్త నిబంధన
గ్రీన్‌కార్డ్, పౌరసత్వం, ఆశ్రయం వంటి కొన్ని వలస దరఖాస్తులను ఆన్లైన్లో దాఖలు చేయడాన్ని అమెరికా తప్పనిసరి చేయనున్నది. ఈ మార్పు వల్ల ఖర్చులు తగ్గుతాయని, పొరపాట్లు నివారించవచ్చని, కేసుల పరిష్కార ప్రక్రియ వేగవంతం అవుతుందని అధికారులు తెలిపారు.
న్యూఢిల్లీ: గ్రీన్‌కార్డ్, పౌరసత్వం, ఆశ్రయం వంటి కొన్ని వలస దరఖాస్తులను ఆన్లైన్లో దాఖలు చేయడాన్ని అమెరికా తప్పనిసరి చేయనున్నది. ఈ మార్పు వల్ల ఖర్చులు తగ్గుతాయని, పొరపాట్లు నివారించవచ్చని, కేసుల పరిష్కార ప్రక్రియ వేగవంతం అవుతుందని అధికారులు తెలిపారు. ఫెడరల్ రిజిస్టర్లో సోమవారం ప్రచురితమైన అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) కొత్త నిబంధన ప్రకారం కనీసం 180 రోజులపాటు ఆన్లైన్ దాఖలుకు అందుబాటులో ఉన్న ఏ ఫారమ్ అయినా ఇకపై ఆ పద్ధతిలోనే సమర్పించాల్సి ఉంటుంది.
అలాగే ముందుగా 60 రోజుల నోటీసు ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో మరిన్ని ఫారాలను కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే సమర్పించేలా చేసే అధికారం కూడా ఈ నిబంధన యూఎస్‌సీఐఎస్‌కి కల్పిస్తుంది. ఈ మార్పు గ్రీన్ కార్డ్ అభ్యర్థనలను, పునరుద్ధరణలు(రెన్యువల్స్), కుటుంబ ఆధారిత పిటిషన్లు, ఆశ్రయం క్లెయిమ్‌లు, పనిచేయడానికి అనుమతి దరఖాస్తులు, తాత్కాలిక రక్షిత హోదా ఫైలింగ్‌లు సహా అనేక రకాల దరఖాస్తులపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

