Telangana | హైదరాబాద్ : ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి మరో 2 నోటిఫికేషన్లను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు గురువారం విడుదల చేసింది. ఇందులో డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులు ఉన్నాయి. డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 48 ఉండగా, స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులు 4 ఉన్నాయి. స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులకు జూలై 12 నుంచి 26వ తేదీ వరకూ.. డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు జూలై 14 నుంచి 25వ తేదీ వరకూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు, విద్యార్హతలు, ఇతర వివరాలను బోర్డు వెబ్సైట్లో (https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm) అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు.