గోల్నాక, జనవరి 5 : అనారోగ్య సమస్యలతో ఓ కానిస్టేబుల్ ఆత్యహత్య చేసుకున్న ఘటన అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్‌పేటలోని మల్లికార్జుననగర్‌కు చెందిన భానుశంకర్(47) పరిగి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఐదేండ్లుగా కిడ్నీ, ఇతర అనారోగ్య సమస్యలతోబాధపడుతున్నాడు.
అనేక దవాఖానల్లో చికిత్స తీసుకున్న కూడా జబ్బు నయం కాలేదు. జీవితంపై విరక్తి చెందిన భానుశంకర్ ఆదివారం ఇంట్లో ప్యాన్‌కు ఉరేసుకున్నాడు. ఎస్సై, క్లూస్‌టీం ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహన్ని పొస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు.