Mega DMart | ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 1 : చాక్లెట్ దొంగతనం చేశాడని బాలుడిని చితకబాదిన సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలానికి చెందిన ఆరూరి శివ మంచాల మండలం నోముల సమీపంలోని బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం మధ్యా హ్నం ఇబ్రహీంపట్నంలోని మంచాల రోడ్డులోగల మెగా డీమార్ట్‌కు వచ్చా డు. అందులో చాక్లెట్ దొంగతనానికి పాల్పడ్డాడన్న నెపంతో సూపర్‌మార్కెట్‌కు చెందిన ముజాఫిర్, ఖాదీర్, చింటు, సమీర్, రాకేషన్ అనే వ్యక్తులు సదరు విద్యార్థిని గోడౌన్లో బంధించి చితకబాదడంతో తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న వార్డెన్‌తోపాటు అధ్యాపకులు సూపర్ మార్కెట్ యాజమాన్యంపై ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.