హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఆయా పార్టీల్లోని అసంతృప్త నేతలు వచ్చి చేరేందుకు బీజేపీ ఏమీ చెత్తకుప్ప కాదని ఆ పార్టీ సీనియర్ నేత మురళీధర్‌రావు వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి కొండా సురేఖ బీజేపీలో చేరుతారని వస్తున్న వార్తలపై ఆయన ఈ మేరకు శనివారం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.
కాంగ్రెస్‌లో సంక్షో భం మొదలైందని, దాన్ని పక్కదారి పట్టించేందుకే కొండా సురేఖ బీజేపీలోకి వస్తున్నారంటూ కథనాలు వస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదగాలని కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారని, కల్చర్, క్యారెక్టర్, పొలిటికల్ కంటెంట్ ఉన్న వారినే తమ పార్టీలోకి తీసుకుంటామని ఆయన తేల్చి చెప్పారు.