మేడిపల్లి, సెప్టెంబర్ 29 : జగిత్యాల జిల్లా భీమారం మండలం మన్నెగూడెం-తక్కళ్లపెల్లి రోడ్డు బురదమయం కావడంతో మన్నెగూడెం యువకులు మంగళవారం బురదలో దిగి, కేక్ కట్ చేసి వినూత్న నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.. ఎన్నికల్లో గెలిచిన 100 రోజుల్లో రోడ్డు పనులు పూర్తిచేయిస్తానని ప్రజలందరి సమక్షంలో హనుమాన్ గుడి వద్ద హామీ ఇచ్చి ఇప్పుడు మరచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు.