మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపి ఇంటి ప్రహరి ఎక్కించాడు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. కేవీఆర్ వ్యాలీలో ఉంటున్న సురేంద్ర మల్లంపేట్ నుంచి బౌరంపేట్కు కారులో బయలు దేరాడు.
ఈ క్రమంలో వేగంగా నడుపుతూ డివైడర్ను ఢీకొట్టి ఆపై ప్రహరి ఎక్కించాడు. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.