హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా కంది జైలులో ఉన్న హెచ్‌సీయూ విద్యార్థులు నేడు విడుదల కానున్నారు. శుక్రవారం విడుదల కావాల్సి ఉండగా ఫార్మాలిటీస్ పూర్తి కావడంలో ఆలస్యమవడంతో వాయిదా పడింది. హెచ్‌సీయూ పరిధిలోని 400 ఎకరాల్లో చెట్లను నరికేయడాన్ని నిరసిస్తూ ఆందోళనలో పాల్గొన్న ఎర్రం నవీన్, రోహిత్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కంది జైలుకు తరలించారు.
బెయిల్ మంజూరైనప్పటికీ కూకట్పల్లి మెజిస్ట్రేట్ సెలవులో ఉండటంతో ఎల్బీనగర్కు బదిలీ చేసినట్టు విద్యార్థులు వెల్లడించారు. అక్కడి నుంచి బెయిల్ పేపర్లు తిరిగి కంది జైలు కు వెళ్లేసరికి సమయం అయిపోవడంతో విడుదల నేటికి వాయిదా వేశారని చెప్తున్నారు.