కొండాపూర్, సెప్టెంబర్ 1 : గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి డాక్టర్ డీకే సునీల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులైనట్టు వర్సిటీ యాజమాన్యం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. వర్సిటీలోని స్కూల్ ఆఫ్ ఫిజిక్స్ విభాగం సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎలక్ట్రానిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో 2019లో ప్రొఫెసర్ సామ్రాట్ ఎల్ సబత్ పర్యవేక్షణలో సునీల్ పీహెచ్డీ పూర్తి చేశారు. సునీల్‌కు వర్సిటీ యాజమాన్యం అభినందనలు తెలిపింది.