హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి మామిడాల యశస్విని స్థానికంగా లేకపోయినా అచ్చంపేట నియోజకవర్గంలో ఓటరుగా ఉన్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఓటర్ల జాబితా నుంచి ఆమె పేరును తొలగించకపోవడాన్ని తప్పుపడుతూ దాఖలైన ఈ పిటిషన్‌పై హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరా ధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.
పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది వాదిస్తూ.. యశస్విని చాలాకాలం విదేశాల్లోనే ఉన్నారని, ఐదేండ్లలో అయిదున్నర నెలలు మాత్రమే ఇకడ ఉన్నారని తెలిపారు. రంగారెడ్డి జిల్లా కొత్తపేట చిరునామాతో ఆమెకు పాస్‌పోర్టు ఉన్నదని చెప్పారు. ఆ చిరునా మా ప్రకారం నాగర్‌కర్నూల్‌లో ఆమెకున్న ఓటును తొలగించాలని కోరా రు. దీంతో ముసాయిదా ఓటర్ల జాబితాతోపాటు సవరించిన, తుది ఓటర్ల జాబితాలను అందజేయాలని సీఈసీని ఆదేశించింది. విచారణను 15కి వాయిదా వేసింది.