ఆదివారం 24 జనవరి 2021
Telangana - Dec 27, 2020 , 08:23:21

నేడు హవల్దార్‌ పరశురాం అంత్యక్రియలు

నేడు హవల్దార్‌ పరశురాం అంత్యక్రియలు

మహబూబ్‌నగర్: దేశసరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోయిన హవల్దార్‌ పరశురాం మృతదేహం స్వగ్రామానికి చేరింది. డిసెంబర్‌ 24న లఢక్‌లోని లేహ్‌లో కొండచరియలు విరిగిపడటంతో పరశురాం ప్రాణాలు కోల్పయిన విషయం తెలిసిందే. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని గండీడ్‌ మండలం గువ్వనికుంట తండా ఆయన స్వస్థలం. పరశురాం పార్థివదేహం శనివారం రాత్రి శంషాబాద్‌ విమానాశ్రయానికి చెరింది. అటునుంచి ప్రత్యేక వాహనంలో గువ్వనికుంట తండాకు తరలించారు. దీంతో ఆయన స్వగ్రామానికి భారీ ఎత్తున జనం తరలివచ్చారు. ముకర్లాబాద్‌ నుంచి జాతీయ జెండాలతో పరశురాం స్వగృహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.


హవల్దార్‌ పరశురాం కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. రూ.25 లక్షల సాయం అందజేస్తామని హామీ ఇచ్చింది. మహబూబ్‌నగర్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇల్లు కేటాయిస్తామని భరోసా కల్పించింది. ఆర్మీజవాన్‌ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ధైర్యం చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు పరశురాం కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం అదజేస్తామని చెప్పారు. సైనిక సంక్షేమ నిధినుంచి కూడా నిధులు విడుదలయ్యేలా కృషిచేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రం సైతం తగిన గౌరవం ఇవ్వాలని మంత్రి కోరారు.  


logo