హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు హరితహారం ప్రకృతికి మణిహారంగా నిలిచిందని కర్ణాటక అడిషనల్ చీఫ్ సెక్రటరీ జావేద్ అక్తర్ ప్రశంసించారు. పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపుపై అధ్యయనం చేసేందుకు శుక్ర, శనివారాల్లో తెలంగాణలో పర్యటించారు. హరితహారం సాధించిన ప్రగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మలాజిగిరి జిల్లా ల్లో పర్యటించిన ఆయన దూలపల్లి ఫారెస్ట్ రిసెర్చ్ నర్సరీ, కండ్లకోయ ఆక్సిజన్ అర్బన్ ఫారెస్ట్పార్, ఔటర్ రింగ్‌రోడ్డు వెంట పచ్చదనం, హైదరాబాద్‌లో అంతర్గత రోడ్ల వెంట ఎవెన్యూ ప్లాంటేషన్ (రహదారి వనాలు), మీడియన్ ప్లాంటేషన్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా జావేద్ అక్తర్ మీడియాతో మా ట్లాడుతూ.. తెలంగాణకు హరితహారం అద్భుతమైన కార్యక్రమమని, తాను పర్యటించిన అన్నిప్రాంతాల్లో పచ్చదనం పరుచుకొన్నదని ప్రశంసించారు. ప్రభుత్వ సంకల్పానికి అధికారులు, సిబ్బంది, ప్రజల కృషి తోడైతే ఫలితా లు కనిపిస్తాయనడానికి తెలంగాణ నిదర్శనమని కొనియాడారు. కండ్లకోయ ఆక్సిజన్ అర్బన్ ఫారెస్ట్ పార్ను అద్భుతంగా అభివృద్ధి చేశారని చెప్పారు. తెలంగాణను స్ఫూ ర్తితో కర్ణాటక ప్రభుత్వం కూడా పట్టణాల్లో పచ్చదనం పెంపుదలకు ప్రణాళికలు రూపొందిస్తున్నదని, ఆ అధ్యయనంలో భాగంగానే తాము తెలంగాణలో పర్యటించినట్టు వెల్లడించారు. సీఎంవోఎస్డీ (హరితహారం) ప్రియాంకవర్గీస్ స్వయంగా హరితహారం కార్యక్రమాలను వివరించారు. క్షేత్రస్థాయి పర్యటన తర్వాత అరణ్యభవన్‌లో అటవీశాఖ ఉన్నతాధికారులతోనూ జావేద్ సమావేశమయ్యారు.
Colle