తన పుట్టినరోజున (జూన్ 3) ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని, సేవాకార్యక్రమాల ద్వారా తనపై ప్రేమను చాటాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. తనను ఆశీర్వదించేందుకు వస్తామంటూ చాలామంది ఫోన్లు, మెసేజ్‌లద్వారా విజ్ఞప్తి చేస్తున్నారని తెలిపారు. ముందే నిర్ణయించుకున్న వ్యక్తిగత కార్యక్రమాల్లో భాగంగా తాను అందుబాటులో ఉండడం లేదని, అందరినీ నిరాశపరుస్తున్నందుకు మన్నించాలని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
శుక్రవారం రోజున హైదరాబాద్‌లోకానీ, సిద్ధిపేటలో కానీ ఉండడం లేదని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. వ్యక్తిగత కార్యక్రమాల్లో భాగంగా దూరంగా ఉండాల్సి వస్తోందని స్పష్టంచేశారు. అందరి అభిమానానికి మరోసారి తలవంచి నమస్కరిస్తున్నానన్నారు. ప్రజల ఆదరాభిమానాలు, ప్రేమను తన గుండెల్లో పెట్టుకుంటానని చెప్పారు.