యాదాద్రి భువనగిరి : బీఆర్ఎస్(BRS)లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉన్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి వెల్లువలా వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Minister KTR) సమక్షంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు సుదగాని హరిశంకర్ గౌడ్, యాదగిరిగుట్ట మాజీ ఎంపీపీ పల్లెపాటి సత్యనారాయణ తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ ఒంటెద్దు పోకడ వల్లే ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరామన్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమన్నారు.