Jublihills PS : జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్రావు విచారణ కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో గత ఆరు గంటలుగా సిట్ విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా న్యాయవాదులను లోపలికి అనుమతించలేదు. దాంతో బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకుని ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ తెలంగాణ భవన్ నుంచి జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్కు బయలుదేరి వెళ్లారు. జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ దగ్గర ఆందోళనకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు చూడవచ్చు..
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి
ఐదు గంటలుగా కొనసాగుతున్న హరీష్ రావు విచారణ
న్యాయవాదులను లోపలికి అనుమతించని పోలీసులు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు
తెలంగాణ భవన్ నుండి జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు బయలుదేరిన ఎమ్మెల్యేలు వేముల… https://t.co/DQ8rd1P3aK pic.twitter.com/KFhfsXDvcE
— Telugu Scribe (@TeluguScribe) January 20, 2026