హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి దర్శనం కోసం తెలంగాణ భక్తులు తీసుకొచ్చే ఎమ్మె ల్యే, ఎమ్మెల్సీల సిఫారసు లేఖలను పరిగణనలోకి తీసుకోవాలని టీటీడీ నూతన చైర్మన్ బీఆర్ నాయుడును మాజీమంత్రి హరీశ్‌రావు కోరారు. బీఆర్ నాయుడు మంగళవారం హైదరాబాద్‌లోని హరీశ్‌రావు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. హరీశ్ ఆయనకు పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ సుదీర్ఘకాలం మీడియా రంగంలో ఉన్న బీఆర్ నాయుడికి కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి సేవ చేసే అవకాశం లభించ డం అదృష్టమని పేర్కొన్నారు. సిద్దిపేటలో నిర్మించ తలపెట్టిన టీటీడీ ఆలయ ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని, త్వరగా పను లు ప్రారంభించాలని కోరారు. బీఆర్ నా యుడు మాట్లాడుతూ నిర్మాణంలో ఉన్న టీటీడీ ఆలయ పనులను పూర్తిచేసేందుకు బోర్డులో చర్చిస్తామని చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ సిఫారసు లేఖలను పరిగణనలోకి తీసుకోవడంపై ప్రభుత్వంతో మా ట్లాడి, బోర్డులో చర్చించి సానుకూల నిర్ణ యం తీసుకుంటామని హామీ ఇచ్చారు.