Lasya Nanditha | లాస్య నందితకు నివాళులర్పించిన బీఆర్ఎస్ నాయకులు
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) పార్థివదేహాని బీఆర్ఎస్ నేతలు నివాళులర్పించారు. కార్ఖానాలో నివాసానికి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత, ఎంపీ కేకే, మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీశ్ రావు,..
హైదరాబాద్: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) పార్థివదేహాని బీఆర్ఎస్ నేతలు నివాళులర్పించారు. కార్ఖానాలో నివాసానికి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత, ఎంపీ కేకే, మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీశ్ రావు, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దారం నాగేందర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, కార్పొరేటర్ విజయా రెడ్డితోపాటు పలువురు నాయకులు ఆమె భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మరికాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అక్కడి చేరుకోనున్నారు.
శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు పటాన్‌చెరూ సమీపంలో ఓఆర్ఆర్పై అదుపుతప్పి రెయిలింగ్‌కు ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. ఇవాళ సాయంత్రం మారేడుపల్లిలోని శ్మశానవాటికలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

