యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 23: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ఈనెల 25న నిర్వహించే గిరిప్రదక్షిణలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పాల్గొంటారని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడు తూ హరీశ్‌రావు గురువారం తెల్లవారుజామున 5 గంటలకు గిరిప్రదక్షిణలో పాల్గొని పాదయాత్రగా కొండపైకి చేరుకొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ విప్, గొంగిడి సునీత, టెస్కాబ్ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి పాల్గొంటారని తెలిపారు. ఆలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, విద్యార్థి, యువజన విభాగం నాయకులు, నార్ముల్ డైరెక్టర్లు, పాల సం ఘాల చైర్మన్లు అధిక సంఖ్యలో పాల్గొనాలని కర్రె వెంకటయ్య సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రామిరెడ్డి, బీఆర్ఎస్ బీసీ విభాగం మండలాధ్యక్షుడు కవిడే మహేందర్, మాజీ కౌన్సిలర్ బూడిద సురేందర్, కర్రె శేఖర్, బీర్ల చంద్రయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.