Harish Rao | వికారాబాద్ : విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) పోరాటంతోనే కేంద్ర దిగివచ్చిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు( Harish rao ) స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు గురించి కేసీఆర్, కేటీఆర్ నేను మాట్లాడం. కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగివచ్చి.. విశాఖ ఉక్కును అమ్మం.. బలోపేతం చేస్తామని కేంద్రం ప్రకటించింది.
విశాఖ ఉక్కుపై ఏపీ అధికారపక్షం, ప్రతిపక్షం నోరు విప్పలేదు అని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఏపీ ప్రజలు, కార్మికుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేసింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రంపై పోరు కొనసాగిస్తాం అని స్పష్టం చేశారు. ఇది కేసీఆర్ విజయం.. బీఆర్ఎస్ విజయం.. ఇది ఏపీ ప్రజల విజయం.. విశాఖ కార్మికుల విజయం అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.