హైదరాబాద్: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీకి స్పీకర్ ప్రసాద్ కుమార్ బ్లాక్ డ్రెస్‌లో వచ్చారు. సభలోకి వస్తూనే సభ్యులందరికీ నమస్కారం పెడుతున్నారు. ఈ సందర్భంగా మా ఆవేదన అర్ధం చేసుకొని మీరు కూడా బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చి మాకు మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు స్పీకర్ సార్ అంటూ హరీశ్‌రావు అన్నారు.
నిండు సభలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ రెడ్డి అవమానించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రికి మద్దతుగా డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క కూడా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇరువురు నేతలు మహాళా ఎమ్మెల్యేలకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల రిబ్బన్ ధరించి సభకు హాజరయ్యారు.
మా ఆవేదన అర్ధం చేసుకొని మీరు కూడా బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చి మాకు మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు స్పీకర్ సార్ 🙏
– అసెంబ్లీలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish https://t.co/B4Cg6BCnC5 pic.twitter.com/p7QY7K6cvu
— BRS Party (@BRSparty) August 1, 2024