Harish Rao | పేదల భూములను నిషేధిత జాబితాలో పెట్టిన పొంగులేటిని అసెంబ్లీకి రాకుండా రేవంత్ రెడ్డి నిషేధించాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై కుమ్రంభీం జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్లో బీఆర్ఎస్ పోరుబాట ( BRS Protest ) నిర్వహించింది. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ..కొండా సురేఖ నిన్ను తిట్టిందని మంత్రి వర్గం నుంచి తీసేశావు. మరి లక్షల మంది ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద నువ్వు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు.
నీకు ఏమైనా పొంగులేటి చేసే పనుల్లో 50/50 వాటా ఉందా రేవంత్ రెడ్డి అని నిలదీశారు. బ్యాంక్ క్రాప్ లోన్ కోసం పోతే మా భూమి నిషేధిత జాబితాలో పెట్టారని చెబుతున్నారు. గతంలో క్రాప్ లోన్ వచ్చింది ఇప్పుడు ఎందుకు రావడం లేదని అడిగితే 22A కింద మీ భూమి ఉందని బ్యాంకులో చెబుతున్నారని హరీశ్ రావు ముందు ఓ మహిళన ఆవేదన వ్యక్తం చేసింది. ప్రజలను ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ను బొంద పెట్టాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు.
ఈ పేదల భూములను నిషేధిత జాబితాలో పెట్టిన పొంగులేటిని అసెంబ్లీకి రాకుండా రేవంత్ రెడ్డి నిషేధించాలి
కొండా సురేఖ నిన్ను తిట్టిందని తీసేశావు.. మరి లక్షల మంది ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద నువ్వు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు
నీకు ఏమైనా దాంట్లో… pic.twitter.com/Dz9xBgyE8x
— Telugu Scribe (@TeluguScribe) September 4, 2026