యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట (Yadagrigutta) లక్ష్మీనరసింహస్వామి వారి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా యాదాద్రి ఆలయంలో నిర్వహించిన గిరిప్రదక్షిణ నిర్వహించారు. గిరిప్రదక్షిణలో సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao), ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, బూడిద బిక్షమయ్య గౌడ్, బీఆర్ఎస్ నాయలకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, గొంగిడి మహేందర్ రెడ్డి, రామకృష్ణా రెడ్డి, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గుట్ట చుట్టూ తిరిగి మొక్కులు చెల్లింకున్నారు. లక్ష్మీనరసింహ స్వామివారికి ఆలయ అర్చకులు అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు.
గిరిప్రదక్షిణ చేసిన హరీశ్ రావు గర్భగుడిలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయనకు ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేద ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థ ప్రసదాలు అందజేశారు.