హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 17(నమస్తే తెలంగాణ): స్వల్ప అస్వస్థతతో బేగంపేటలోని సన్‌షైన్ కిమ్స్‌లో చికిత్స పొం దుతున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోగ్యం కుదుటపడింది. మంగళవారం సాయంత్రం ఆయన దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారు. సోమవారం కేటీఆర్ ఏసీబీ విచారణ నేపథ్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు తెలంగాణ భవన్లో ఉన్న హరీశ్‌రావు ఒక్కసారిగా నీరసించి, అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.